భగత్‌నగర్ దోపిడీ కేసులో దర్యాప్తు ముమ్మరం

తెలుగు కే న్యూస్ కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో వృద్ధ దంపతుల నివాసంలో ఇటీవల జరిగిన భారీ దోపిడీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కుటుంబ విభేదాల కోణంతో పాటు ఇతర అనుమానాస్పద అంశాలపై కూడా సమగ్రంగా విచారణ చేపడుతున్నారు.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగగా, పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, స్థానికుల సమాచారాన్ని పరిశీలిస్తూ కేసు ఛేదన దిశగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.