భారీ వర్షాల నేపధ్యంలో కామారెడ్డి చెరువు సమీక్షించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, వాగులు కల్వర్టులకు, వేటకు వెళ్లొద్దని ఎస్పీ హెచ్చరిక

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లి నీటి ప్రవాహం, నీటి మట్టాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, వాగులు, కల్వర్టులు, వరద ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లరాదని, సెల్ఫీలు మరియు వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాలు, రద్దీ కూడళ్ల వద్ద అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులందరూ క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంటూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అనంతరం గురు రాఘవేంద్ర కాలనీ బ్రిడ్జి ప్రాంతాని ఎస్పీ పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి కామారెడ్డిలోని సుభాష్ రోడ్ చౌరస్తా వద్ద వరద నీటిలో చిక్కుకున్న పెళ్లి బస్సులోని 45 మంది ప్రయాణికులను పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి వారి ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, 45 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అంకితభావాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించారు. భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను గానీ లేదా డయల్-100 అత్యవసర సేవలను గానీ సంప్రదించాలని కోరారు.
జిల్లా ఎస్పీ వెంట కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌ఐ రంజిత్, కామారెడ్డి ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.