నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం:- మద్దేపల్లి గ్రామంలో రైతుల పొలాల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పంటలకు నీరందించే విద్యుత్ మోటార్లకు సంబంధించిన వైర్లను రాత్రి సమయంలో కట్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ కనెక్షన్ బాక్సులను ధ్వంసం చేసి వైర్లను తీసుకెళ్లడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక పంటలకు నీటి అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటి చోరీ జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Post Views:84
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.