
కరీంనగర్ తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 17
మహాత్మా జ్యోతిబా పూలె పాఠశాలలో విద్యార్థినులు వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో గణనాథుని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు చిన్నారులు మట్టి గణపతులను తయారు చేసి, చేతులు జోడించి ప్రార్థనలు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకులను పూజించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు


