

పండుగ సందర్భంగా జానపద గీతాలు ఆలపిస్తూ యువతులు నృత్యాలు చేసి సందడి చేశారు. కుటుంబాల్లో సుఖశాంతులు నెలకొనాలని, మంచి వర్షాలు కురిసి రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని దేవతలను ప్రార్థించారు.
తీజ్ పండుగ వేడుకలతో మాన్సింగ్ తండా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.


