మొబైల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు సీఈఐఆర్ విధానంతో తిరిగి పొందవచ్చు 20 రోజుల్లో రూ. 23 లక్షల విలువైన 139 మొబైల్ ఫోన్లు స్వాధీనం

కామారెడ్డి జిల్లా: k24 న్యూస్ తెలుగు: మొబైల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఈఐఆర్ అంతర్జాల విధానం ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. సెప్టెంబర్ 1న జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. పోలీస్ ప్రత్యేక బృందం ద్వారా ఇప్పటివరకు జిల్లాలో ₹8.66 కోట్ల విలువైన 5,414 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించామని ఎస్పీ పేర్కొన్నారు. గత 20 రోజుల్లోనే ₹23 లక్షల విలువైన 139 మొబైల్ ఫోన్లను, అలాగే ఈ ఏడాది ఇప్పటివరకు ₹1.81 కోట్ల విలువైన 1,133 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు.
మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును నిలిపివేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. రికవరీ అయిన మొబైల్ ఫోన్లను సరైన ఆధారాలు చూపించి జిల్లా పోలీసు కార్యాలయంలో పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు సహాయపడిన సాంకేతిక బృందాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.