రోడ్లపై చెత్త.. పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా,నవీపేట మండలంలోని :-మద్దేపల్లి గ్రామంలో పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా గ్రామ పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలోని రోడ్లపై చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై చెత్త కనిపిస్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరితో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసి, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.