వర్షాల కారణంగా టేక్రియల్ లో కుంగిపోయిన రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

కామారెడ్డి జిల్లా :k14 న్యూస్ తెలుగు

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పర్యటించి, వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులను, సమస్యలను పరిశీలించారు.

ఈ పర్యటనలో భాగంగా 13వ వార్డు టేక్రియల్ గ్రామంలో వర్షాల తీవ్రతకు దెబ్బతిని కుంగిపోయిన రహదారిని ఛైర్పర్సన్ నేరుగా పరిశీలించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదరు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత మున్సిపల్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు.

ప్రస్తుత వర్షాల దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ముంపు ప్రమాదం ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఛైర్పర్సన్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ గిరి,ఎమ్మార్వో హిమబింద్,DE హన్మాంతారావు,కౌన్సిలర్స్ లలిత చిట్టి బాబు,సత్యం, భూపాతి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.