వృథాగా పారుతున్న బోరు నీరు.. చర్యలు తీసుకోని గ్రామపంచాయతీ కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ :-మద్దేపల్లి గ్రామంలో బోరు నుండి భారీగా నీరు లీక్ అవుతూ వృథాగా పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు పైపులైన్ వద్ద లీకేజీ కారణంగా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో నీరు రోడ్డుపై పారిపోతుండటంతో గ్రామంలో నీటి సమస్య మరింత తీవ్రమవుతోందని చెబుతున్నారు.
ఈ సమస్యపై గ్రామపంచాయతీ కార్యదర్శికి గ్రామస్థులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. లీకేజీని వెంటనే మరమ్మతు చేసి వృథాగా పోతున్న నీటిని నిలువరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.