సమాచార హక్కుల చట్టం సాధన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోడిప్యాక సాయిరాం నియామకం

కోడిప్యాక సాయిరాంకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదోన్నతి

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్27:k24 న్యూస్ తెలుగు : సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కోడిప్యాక సాయిరాంను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ కమిటీ జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

సెప్టెంబర్ 27, 2026న జారీ చేసిన నియామక ఉత్తర్వుల ప్రకారం సాయిరాంకు తక్షణమే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు పూర్తి సమయం, శక్తిని వినియోగించాలని కమిటీ సూచించింది.

అయితే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సాయిరాం యథావిధిగా కొనసాగనున్నారు. రాష్ట్ర స్థాయిలో కొత్త బాధ్యతలతో పాటు కామారెడ్డి జిల్లాలో సమాచార హక్కు చట్టంపై అవగాహన, సంస్థ విస్తరణ కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

సాయిరాంకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించడంపై కమిటీ నాయకులు, సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.