
మంచిర్యాల, జూలై 24 (తెలుగు K24 న్యూస్):
సింగరేణి సంస్థ బొగ్గుతో పాటు కీలక ఖనిజాల అన్వేషణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కొత్తగూడెంలోని రైటర్ బస్తీలో ఏర్పాటు చేసిన నూతన జియో సైన్స్ ల్యాబొరేటరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు, భద్రాద్రి జిల్లా కలెక్టర్, మేయర్, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొత్త ల్యాబ్ ద్వారా బొగ్గు, ఇతర కీలక ఖనిజాల అన్వేషణకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.







