సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

బేజ్జంకి, తెలుగు కే న్యూస్ ఆగస్టు 5: సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న “సైబర్ జాగృతి దివస్” కార్యక్రమంలో భాగంగా “సురక్షా కా తిరంగా – టువార్డ్స్ ఎ సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ” అనే అంశంపై బుధవారం బేజ్జంకి మండలం రెగులపల్లి గ్రామంలోని సెంట్ విన్సెంట్ పల్లోట్టి హైస్కూల్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో సిద్ధిపేట రూరల్ సీఐ, సిద్ధిపేట రూరల్ ఎస్‌ఐ, చిన్నకోడూరు ఎస్‌ఐ, బేజ్జంకి ఎస్‌ఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో జరిగే మోసాలు, ఆన్‌లైన్ సైబర్ నేరాలు, డిజిటల్ లావాదేవీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ భద్రతా మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.అదేవిధంగా సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం అందరితో సైబర్ భద్రతా ప్రతిజ్ఞ చేయించి, అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను నివారించవచ్చని వివరించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :