స్త్రీ నిధి లక్ష్యాల సాధనకు శాఖల సమన్వయం అవసరం: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా : K24 న్యూస్ తెలుగు
స్త్రీ నిధి ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు సకాలంలో రుణాలు అందించి, రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్త్రీ నిధి రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.114.60 కోట్ల క్రెడిట్ ప్లాన్ లక్ష్యానికి గాను జూన్ 30 నాటికి రూ.16.47 కోట్ల రుణాలు మంజూరు చేసి 14.38 శాతం లక్ష్యం సాధించినట్లు అధికారులు తెలిపారు. రూ.25.66 కోట్ల ఓవర్‌డ్యూ బకాయిల్లో 41.19 శాతం రికవరీ నమోదైంది.
జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులు ‘మన స్త్రీ నిధి’ యాప్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ఓవర్‌డ్యూ బకాయిల వసూళ్లను వేగవంతం చేసి శాఖల సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా, స్త్రీ నిధి, SERP, MEPMA తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.