హుస్నాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన ఇన్‌చార్జి శ్రవణ్ కుమార్ గౌడ్ తొలి పర్యటన

తెలుగు కే న్యూస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన పూరెళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్ తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించారు. కోహెడలో పార్టీ జెండా కార్యక్రమంలో పాల్గొని, హుస్నాబాద్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పన, జాబ్ మేళాల నిర్వహణ, పోటీ పరీక్షల విద్యార్థులకు అధ్యయన సామగ్రి అందజేయడం, గౌరవెల్లి భూ నిర్వాసితులకు న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :