హైకోర్టు న్యాయవాదిగా రజిత యాదవ్‌కు సన్మానం

మహదేవపూర్, తెలుగు కే న్యూస్ జూలై 20: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన ములకల్లా రాజయ్య యాదవ్ కుమార్తె రజిత యాదవ్ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా సభ్యత్వం పొందిన సందర్భంగా ఆమెను అఖిల భారత యాదవ సంఘం కాటారం డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరి స్వామి యాదవ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యాదండ్ల రామన్న యాదవ్, కొడాలి చిన్న మల్లయ్య యాదవ్, కన్నెబోయిన ఐలయ్య యాదవ్, లచ్చన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.