హైదరాబాద్ లో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

హైదరాబాద్‌లోని సురభి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6 ఆగస్టు 2026, ఉదయం 10.00 గంటలకు టీఆర్‌ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో “సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ” నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, యువత సాధికారత, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.