4 వేల మందికి అన్నదానం చేసిన పద్మశాలి యువజన సంఘం గణేష్ ఉత్సవ కమిటీ

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 23 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలోని గంజ్ స్కూల్ వద్ద పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా దాదాపు 4,000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.

పద్మశాలి యువజన సంఘం కన్వీనర్ ఐరేని సందీప్ కుమార్ మాట్లాడుతూ,

వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని, సుమారు 4 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గిరి, ట్రైనీ ఐఏఎస్ రవితేజ, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, పట్టణ ఎస్‌హెచ్‌ఓ నరహరి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు సబ్బని కృష్ణ హరి, సెక్రటరీ గుర్రపు నరసింహస్వామి క్యాషియర్ అల్వాల గోపాల్, పద్మశాలి మాతృ సంఘం నాయకులు సామల బాల నరసయ్య, సబ్బని ధర్మపురి, బొమ్మరి రాజయ్య, నక్క శ్రీనివాస్ , దూస వెంకటస్వామి, బొమ్మర రాజయ్య, అల్వాల సతీష్ బండమీది రాజేశం ,తుమ్మ రమేష్ పడిగే శీను, షేర్ల రమేష్ అడ్వకేట్లు జగనాదం, క్యాతం సిద్ధిరాములు , ఉత్సవ కమిటీ నాయకులు బల్ల నరేంద్ర, చెలిమెల భాను ప్రసాద్ గాజుల నరేష్ ,పోలాస సురేష్, ఇప్పకాయల రాజు, బాల్ లింగం
భోగ చందన్, తాటిపాముల సందీప్, తదితరులు పాల్గొన్నారు

పద్మశాలి యువజన సంఘం సభ్యులు, నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.