SIR ఓటరు జాబితా సవరణపై నడుకూడలో అవగాహన సభ

నిజామాబాద్ జిల్లా, నడుకూడ:
నడుకూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గౌరవ బట్టు సంజీవ్ రాజ్ గారి ఆధ్వర్యంలో SIR (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలో మరణించిన వారి వివరాలు, ఇతర గ్రామాలకు వెళ్లిపోయిన వారి వివరాలు, గ్రామానికి కొత్తగా వచ్చిన వారి వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, తొలగింపులు చేపట్టే ప్రక్రియపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, BLOలు, మండల సూపర్వైజర్లు, గ్రామ ప్రజలు పాల్గొని ఓటరు జాబితా సవరణపై అవగాహన పొందారు. అధికారులు సూచించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.