SIR ఫారాలను నింపి బీఎల్‌వోలకు అందజేయాలి: సర్పంచ్ కొడారి సాంబరాజు

జఫర్‌గడ్, జూలై 15 (కె24 న్యూస్ ప్రతినిధి ఆరూరి రాజు): జఫర్‌గడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో బుధవారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ అధికారి (GPO) రమ్య ఆధ్వర్యంలో బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొడారి సాంబరాజు మాట్లాడుతూ, “ఓటు మన ప్రజాస్వామ్యానికి ఆయుధం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు SIR ఫారాలను తప్పనిసరిగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలి” అని కోరారు.
ఈ సమావేశంలో గ్రామ సిబ్బంది, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :