అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని వెంటనే అమలు చేయాలి: దళిత, గిరిజన సంఘాల డిమాండ్


న్యూఢిల్లీ తెలుగు కే న్యూస్ జంతర్ మంతర్ వద్ద అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు కోసం దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎరుకుల కులవృత్తుల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లు, మాదిగ శక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి సురేందర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎస్సీ, ఎస్టీల సంక్షేమ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే త్వరలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత ఎరుకుల కులవృత్తుల అభివృద్ధి సేవా సంఘం, మాదిగ శక్తి సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.