ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన బిజెపి కౌన్సిలర్లు నాయకులు.

 

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జులై 24, తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో
భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు మరియు బిజెపి కౌన్సిలర్లతో కలిసి ఆర్మూర్ మున్సిపల్ కమీషనర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
మందుల బాలు మాట్లాడుతూ, ఆషాడ మాసంలో ప్రజలు పోచమ్మ దేవాలయాలకు వనభోజనాలకు వెళ్తారు. వారికి వసతులు కల్పించాలని కోరడం జరిగింది, ఇందులో ముఖ్యంగా రోడ్లపై మొరం వేయడం, మంచినీటి సౌకర్యం కల్పించడం, టెంట్ సామాగ్రి వసతి కల్పించడం, పిచ్చి మొక్కలు ఉంటే వాటిని తొలగించడం ట్రాక్టర్ తో చదును చేయించడం వంటి కార్యక్రమాలను వెంటనే తక్షణమే చేయాలని హిందూ పండగలకు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇతర మతస్తులకైతే ఆగమేఘాలపై వసతులు కల్పించడం వెనుక వ్యత్యాసం ఏంటని ప్రశ్నించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యామాద్రి కవితా భాస్కర్, బొట్టు రాజు, ఖాందేష్ ప్రశాంత్, శ్రావణ్, పోచంపాడు శీను, పాన్ శీను, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.