కీ,శే. దాసరి మూర్తి సంతాప సభ, నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంఘం నాయకులు.

నిజామాబాద్ జిల్లా, జూలై 17, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,

నిజామాబాద్ జిల్లా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శుక్రవారం రోజున తెలంగాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాసరి మూర్తి సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఇటీవల స్వర్గస్తులైన
కీ,శే. దాసరి మూర్తి, సంతాప సభలో పాల్గొన్న వక్తలు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దాసరి మూర్తి చేసిన సేవలను, బీసీ ఉద్యమాలలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. బీసీ సంక్షేమ
సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు రమణాగౌడ్, నారాగౌడ్, కోయేది నర్సింలు, అశోక్ గౌడ్, నరేష్ ,లు మాట్లాడుతూ,
ఒక మంచి ఉద్యమకారున్ని కోల్పోవడం బీసీ సంఘానికి, ఉద్యమానికి తీరని లోటు అని తన ఆశయాలను సాధించాలన్నారు, అప్పుడే వారి ఆత్మ శాంతిస్తుందని అన్నారు.
ఈ సభ లో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.