కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల స్ఫూర్తితో సేవా కార్యక్రమం.

నిజామాబాద్ జిల్లా, సెప్టెంబర్ 21, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని భిక్షాటన చేసే నిరుపేదలకు అరటిపండ్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అవసరంలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించడం ద్వారా బాపూజీ చూపిన సేవా స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
మహనీయుల ఆశయాలను కేవలం గుర్తు చేసుకోవడమే కాకుండా, వారి స్ఫూర్తితో సమాజానికి సేవ చేయడమే నిజమైన నివాళి అని బ్రహ్మదండి శ్రీకాంత్ అన్నారు.
బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.