
కరీంనగర్ జిల్లాలో తెలుగు కే న్యూస్ నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.






