
తెలుగు కే న్యూస్ ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలకృష్ణతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పిన చంద్రబాబు, అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించినట్లు సమాచారం.






