బాలనగర్ హనుమాన్ ఆలయ ప్రహరీ గోడకు రూ.3 లక్షల నిధులు

నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, సెప్టెంబర్ 02, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
జక్రాన్ పల్లి మండలం పరిధిలోని, బాలనగర్ గ్రామంలో హనుమాన్ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి గ్రామ సర్పంచ్ కొమిరె రాజుకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై గ్రామ సర్పంచ్ కొమిరె రాజు, ఉప సర్పంచ్ బోడాస్ శ్రీనివాస్, వార్డు సభ్యులు బోడాస్ బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పుంజు గంగా నర్సయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద మల్లేష్, వీడీసీ సభ్యులు గంగాధర్, హనుమాన్లు, గ్రామ ప్రజలు
హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.