బెజ్జంకి క్రాసింగ్‌లో ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనం

బెజ్జంకి, జూన్ 10:  రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు బుధవారం బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు భారీ గజమాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రజాసేవలో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గుడెల్లి శ్రీకాంత్, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.