రైల్వే గేట్ వద్ద లారీ టైర్ పంచర్.. ట్రాఫిక్ సమస్యను చాకచక్యంగా నియంత్రించిన పోలీసులు నవీపేట్*

K24 న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ
K24 న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ
*రైల్వే గేట్ వద్ద లారీ టైర్ పంచర్.. ట్రాఫిక్ సమస్యను చాకచక్యంగా నియంత్రించిన పోలీసులు నవీపేట్*
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ :-రైల్వే గేట్ సమీపంలో ఓ భారీ లారీ టైర్ అకస్మాత్తుగా పంచర్ కావడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైల్వే గేట్ వద్దే లారీ నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లారీ టైర్ మరమ్మతులు పూర్తయ్యే వరకు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
పోలీసుల అప్రమత్తతతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా నివారించగలిగారు. వారి సేవలను స్థానికులు, వాహనదారులు అభినందించారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.