వందేమాతరం.. జాతీయ చైతన్యానికి ప్రతీక.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, సెప్టెంబర్ 25, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,

-ప్రతి పాఠశాలలో, ప్రతి కార్యక్రమంలో వందేమాతరం గీతాన్ని ఆలపించాలి,
వేంపల్లి ప్రతాప్ …ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత గ్రామ వికాస్ సహా సంయోజక్
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమ్మర్‌పల్లిలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్, ఆర్మూర్ పాఠశాల ఆధ్వర్యంలో క్షత్రియ కళ్యాణ మండపం లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన వేంపల్లి ప్రతాప్ …ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత గ్రామ వికాస్ సహా సంయోజక్ మాట్లాడుతూ,
బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో జాతీయ చైతన్యాన్ని రగిలించిన నినాదంగా నిలిచిందన్నారు.
వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారని, అనంతరం ఆయన రచించిన ‘ఆనందమఠం’ నవలలో భాగంగా 1882లో ప్రచురితమైందని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ గీతం ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు.
*స్వదేశీ ఉద్యమానికి ఊపిరిగా*
1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైందని ప్రతాప్ పేర్కొన్నారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన స్వదేశీ ఉద్యమంలో వందేమాతరం గీతం ప్రజలను ఏకం చేసే శక్తిగా మారిందన్నారు. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ వస్తువులను వినియోగించడం, జాతీయ విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు ఉద్యమంలో భాగమయ్యాయని వివరించారు.
బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు స్వదేశీ ఉద్యమం విస్తరించిందని తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలోనూ ఉద్యమం ఉధృతంగా సాగిందన్నారు.
*ప్రతి పాఠశాలలో ఆలపించాలి*
వందేమాతరం గీతం దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్న ఆయన.. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వందేమాతరం గీతాన్ని ఆలపించాలని కోరారు. ప్రతి పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో పల్లె గంగారెడ్డి , పసుపు బోర్డు ఛైర్మెన్, భాజపా సీనియర్ నాయకులు, గటడి ఆనంద్, అడ్వకేట్, క్షత్రియ సమాజ్, రవినాథ్  జిల్లా కార్య దర్శి, పాఠశాల అధ్యక్షులు వంశీ,, కార్య దర్శి  ప్రసన్న గౌడ్ ,సహా కార్యదర్శి రజినీకాంత్ ,పాఠశాల నిర్వాహకులు భాను తేజ్ గారు ,అభిమన్యు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్ కుమార్ ,వివిధ పాఠశాలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.