శ్రీరాంసాగర్‌లో విషాదం.. నీటిలో మునిగి నలుగురు యువకుల మృతి

నిజామాబాద్, తెలుగు కే న్యూస్ జూలై 27: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో ఈతకు దిగిన నలుగురు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. నిజామాబాద్‌కు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రకు వెళ్లగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకరిని స్థానికులు రక్షించగా, మిగిలిన నలుగురు మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, లోతైన జలాశయాల్లో ఈతకు దిగొద్దని అధికారులు ప్రజలకు హెచ్చరించారు.