
కరీంనగర్ తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 29
ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా శరీరంలో గుండె అనేది కేవలం ఒక అవయవం మాత్రమే కాదు, అది శరీరంలోని జీవ ద్రవాలైన రస రక్త దాతువులను శరీరమంతా పంపిణి చేసే ప్రధాన కేంద్రము, అది నిజమైన సహజమైన ప్రేమను సూచిస్తుంది, సహజమైన ఆలోచనలు కూడా చేయగలదు.
ప్రస్తుత కాలంలో గుండెపోటు (హార్ట్ ఎటాక్) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ( డ్రై ఫుడ్ ఫ్రై ఫుడ్ జంక్ ఫుడ్ మరియు రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, కల్తీ ఆహారము మరియు పెరిగిన మానసిక ఒత్తిడి శారీరక శ్రమ వ్యాయామం లేకపోవడం వల్ల వస్తున్నాయి.
గతంలో వృద్ధులలో ఎక్కువగా కనిపించే గుండె సమస్యలు ఇప్పుడు యువతలో కూడా విరివిగా కనిపిస్తుంది దీనికి తోడు వాతావరణ కాలుష్యం అలాగే మానవ సంబంధ బాంధవ్యాలలో ప్రేమ లేకపోవడం ఎవరికి వారు ఒంటరి జీవితాలు కావడం స్నేహపూర్వకంగా ఉండే మిత్రులు లేకపోవడం వల్ల కూడా గుండె సమస్యలు వస్తున్నాయి, గుండె పదిలంగా ఉండాలంటే సమతుల్ ఆహారం సహజమైన ప్రకృతి ఇచ్చిన ఆహారం తీసుకోవడం వ్యసనాలకు దూరంగా ఉండటం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం సరిపడా నిద్ర తగిన వ్యాయామం చేస్తూ పక్క వాళ్ళని ప్రకృతిని పరమాత్మను హృదయపూర్వకంగా ప్రేమిస్తూ, ద్రుష్టి హృదయం పై ఉంచి నియమిత సమయం ధ్యానం చేస్తూ హృదయాన్ని పదిలంగా ఉంచుకోవాలి, గుండె చప్పుడు (లయ) ను గమనిస్తూ – గుండెని ప్రేమించండి


