పలమనేరులో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన MP, MLA!

కె 24న్యూస్ తెలుగు జూలై 11. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రూ.20 లక్షల MP నిధులతో పునఃర్నిర్మించిన ప్రభుత్వ సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు, స్థానిక MLA అమర్నాథ్ రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు వసతి గృహంలోని సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి విద్యాభ్యాసం, అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధుల రాకతో విద్యార్థినుల్లో ఎంతో ఉత్సాహం కనిపించింది. నాణ్యమైన విద్య, వసతి కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.