ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ తేజస్విని గన్నేరువరం మండలంలో పర్యటన

తెలుగు K24 న్యూస్ | గన్నేరువరం | జూన్ 29
శిక్షణలో భాగంగా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ కుమారి జిన్నా తేజస్విని సోమవారం గన్నేరువరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి, ఎంపీడీవో కార్యాలయ విధుల నిర్వహణపై అవగాహన పొందారు.
అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్), హెల్త్ సబ్ సెంటర్‌ను తనిఖీ చేసి, అక్కడి నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్, ఏఈ (పీఆర్) సురేందర్, హౌసింగ్ ఏఈ మహేందర్, ఎంఈవో రామయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.