ఆర్‌పీఐ జిల్లా సదస్సులో సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తామని ప్రకటన

కరీంనగర్, జూన్ 30 (తెలుగు K24 న్యూస్): రాష్ట్రంలో సామాజిక న్యాయం కరువైందని, కుల వివక్షకు గురవుతున్న వర్గాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు.
కరీంనగర్‌లో నిర్వహించిన ఆర్‌పీఐ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మహిళల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మీరియా, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :