
బెజ్జంకి: తెలుగు కే న్యూస్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు “సురక్షా నేత్ర” కార్యక్రమంలో భాగంగా గుగ్గిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను సిద్ధిపేట రూరల్ సీఐ విద్యాసాగర్, బెజ్జంకి ఎస్ఐ తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణ, దర్యాప్తు, నేరస్తుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులకు సహకరించాలని ప్రజలకు సూచించారు

