సాలూర మండలంలోని హున్స గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠాపన మరియు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

సాలూర మండలంలోని హున్స గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠాపన మరియు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
నిజామాబాద్సా జిల్లా, సాలూర మండలంలోని:- హున్స గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శిఖర ప్రతిష్ఠాపన మరియు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో దేవాలయాల పాత్ర ఎంతో గొప్పదని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రాంచందర్, వివిధ మండలాల అధ్యక్షులు గంగాధర్, ఇంద్రకరణ్, గోపీకిషన్, సిర్ప సుదర్శన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలారాజు, ప్రజాప్రతినిధులు, బీజేపీ సీనియర్ నాయకులు ఇర్వంత్ రావు పటేల్, పవన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.