కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సురేందర్ మద్దేపల్లిలో వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు… గంగాజలంతో హనుమాన్ ఆలయం, గ్రామ దేవతలకు అభిషేకం

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం:- మద్దేపల్లి గ్రామంలో రైతులు, గ్రామ మహిళలు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా జలాలను కలశాలలో తీసుకొచ్చి గ్రామంలోని హనుమాన్ ఆలయం, గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో అభిషేకం చేశారు.
సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నిండి, పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కష్టాలు తొలగాలని గ్రామస్థులు సామూహికంగా ప్రార్థించారు. కలశాలతో మహిళలు నిర్వహించిన శోభాయాత్ర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
“రైతన్న పొలాల్లో పచ్చదనం వెల్లివిరియాలని… ప్రకృతి కరుణతో మంచి వర్షాలు కురవాలని మద్దేపల్లి గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.”
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :