
-

డొంకేశ్వర్ మండలంలోని :- గంగా సమందర్ గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సర్పంచ్ తొగారి గంగామణి మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో గారు, సంబంధిత అధికారులు, బీఎల్‌ఓతో కలిసి బూత్‌ను సందర్శించి ఇప్పటివరకు జరిగిన నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బీఎల్‌ఓ మాట్లాడుతూ, ఇప్పటివరకు సుమారు 150 దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులకు వివరించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు.







