కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ SIR ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు – ఏన్యుమరేషన్ దరఖాస్తుల భర్తీ

నిజామాబాద్ జిల్లా, నవీపేట్, జూలై 6: నవీపేట్ మండల కేంద్రంలోని 14వ వార్డులో రైతు వేదిక వద్ద SIR (Special Intensive Revision) ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించి, ఏన్యుమరేషన్ దరఖాస్తు పత్రాలను భర్తీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, ఏన్యుమరేషన్ ఫారాల భర్తీ విధానంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, నవీపేట్ ఉప సర్పంచ్ నవీన్ రాజ్, 14వ వార్డు సభ్యుడు సాయితేజ, 4వ వార్డు సభ్యుడు భూనాది నవీన్, మాజీ వార్డు సభ్యుడు అర్షద్ కురేషి, బీఎల్ఓలు సునీత, ఉమాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.