వర్షాలు సమృద్ధిగా కురవాలని బీజేపీ ఆధ్వర్యంలో వరుణ యజ్ఞం

నిజామాబాద్ జిల్లా,నవీపేట్: సకాలంలో వర్షాలు కురవక రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నవీపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో వరుణ యజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు ద్యాగ సరీన్ తెలిపారు.
నవీపేట్‌లోని స్థానిక భక్త మార్కండేయ మందిరంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, భరత్ రెడ్డి తదితర నాయకులు హాజరవుతారని తెలిపారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.