వానాకాలంలోనూ మండుతున్న ఎండలు ఎండిపోతున్న పంటలు ఆవేదనలో రైతులు ఫకీరాబాద్

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :- ఫకీరాబాద్ వానాకాలం సీజన్ కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పొలాల్లోని వరి పంటలు ఎండిపోతున్నాయి. భారీ ఆశలతో సాగు చేసిన రైతులు ఇప్పుడు ఆకాశం వైపు ఆశగా చూస్తూ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి కొరత కారణంగా పంటలు రోజురోజుకూ వాడిపోతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
“ఒక్క మంచి వర్షం పడితేనే పంటలు బతుకుతాయి.. లేకపోతే ఈ సీజన్ మొత్తం నష్టమే” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగుకు చేసిన పెట్టుబడులు, ఎరువులు, విత్తనాల ఖర్చులు పెరిగిపోయాయని, ఇప్పుడు పంటలు ఎండిపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని అందించడంతో పాటు రైతులకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు. అలాగే వరుణుడు కరుణించి త్వరగా సమృద్ధిగా వర్షాలు కురవాలని రైతాంగం ఆశాభావంతో ఎదురుచూస్తోంది.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.