కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సురేందర్ ఎల్‌నినో ప్రభావం – ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

 

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-మద్దేపల్ద్ గ్రామంలో శుక్రవారం ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు మరియు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో కారణంగా ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులు, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు వివరించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నునావత్ మనోజ్ మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిపుణులు తెలిపిన సూచనలను ఆసక్తిగా విన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.