నుస్తులాపూర్‌లో జేబుదొంగల బీభత్సం.. రూ.5 వేల నగదు అపహరణ

తిమ్మాపూర్, జూలై 28 (తెలుగు K24 న్యూస్): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జేబుదొంగలు రెచ్చిపోయారు. బస్సు కోసం వేచి చూస్తున్న ఓ వ్యక్తి జేబులో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.5,000 నగదును చాకచక్యంగా అపహరించారు.కొద్దిసేపటి తర్వాత తన జేబులోని నగదు కనిపించకపోవడంతో బాధితుడు అప్రమత్తమై విషయం గుర్తించాడు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
బాధితుడి పూర్తి వివరాలు, ఘటన జరిగిన పరిస్థితులు, పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.