
నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం,ఆగస్టు 11, తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని, పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం సమయం *మన ఊరు మన భద్రత మన బాధ్యత* కార్యక్రమంలో భాగంగా 25 సీసీ కెమెరాలను, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని , ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని , సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని , సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని , నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని , పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి భద్రత కోసం సి సి కెమెరా లను పెట్టాలని చెప్పారు. ఇది వారి భాద్యత గా తీసుకోవాలి. దుకాణాల యజమానులు తప్పనిసరిగా సి. సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జక్రాన్ పల్లి గ్రామంలో 25 సి.సి కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీ ను పోలీస్ కమీషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా జక్రాన్ పల్లి గ్రామాoలో డ్రగ్స్ నివారణ , సైబర్ నేరాల పట్ల అవగాహన , రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎ.సి.పి ప్రకాష్ , సి.సి.ఆర్.బి ఎ.సి.పి శ్రీ గురు నాయుడు, డిచ్ పల్లి సిఐ తిరుపతి, జక్రాన్ పల్లి ఎస్ఐ మహేష్, గ్రామ సర్పంచ్ బండి పద్మసత్యం, మండల అధ్యక్షులు రెక్కల సురేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.






