
వరంగల్, తెలుగు కే న్యూస్ ఆగస్టు 13: ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు సూచించారు.
గురువారం గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్‌లోని పలు కాలనీలలో నెలకొన్న సమస్యలపై వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, సంబంధిత అధికారులు, కాలనీల అధ్యక్షులతో కలిసి మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని ఆయా కాలనీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




