
తెలుగు కే న్యూస్ మిట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న తాగునీటి వాటర్ ట్యాంక్‌ను ఆర్డబ్ల్యూఎస్ డీఈ కిరణ్, ఏఈ రాజ్‌కుమార్, సర్పంచ్ కామెర మనోహర్, ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్, వార్డు సభ్యులు, స్థానికులతో కలిసి పరిశీలించారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని, నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయాలని అధికారులను కోరారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచ్ కామెర మనోహర్ కోరారు.


