
కరీంనగర్: తెలుగు కే న్యూస్
గిద్దె పెరమండ్ల స్వామి దేవస్థానంలో నాగులచవితి వేడుకలు ఘనంగా జరిగాయి పుట్టకు పాలుపోసి ప్రత్యేక పూజలు భక్తులకు ప్రసాద పంపిణి కార్తీక మాస శుద్ధ చతుర్థి అయిన నాగులచవితి పర్వదినాన్ని గిద్దె పెరమండ్ల స్వామి దేవస్థానం నందు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానానికి చేరుకున్నారు మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి దేవస్థాన ప్రాంగణంలోని పుట్ట వద్ద పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరించి పుట్టకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కొబ్బరికాయలు కొట్టి, నైవేద్యాలు సమర్పించి నాగదేవతను ఆరాధించారు. సంతానం, ఆరోగ్యం, సుఖశాంతుల కోసం భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ ప్రసాద పంపిణి కూడా చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి నాగదేవత ఆశీస్సులు పొందారు ప్రకృతిని నాగజాతిని రక్షించుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ప్రశాంతంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా ముగిసింది.




