ప్రైవేట్ ఆసుపత్రుల అధిక వసూళ్లపై పర్యవేక్షణ ఎక్కడ?

కరీంనగర్‌లో వైద్యం కోసం వస్తున్న సామాన్య ప్రజలపై ఆర్థిక భారం.. ప్రభుత్వ పర్యవేక్షణకు ప్రజల డిమాండ్

కరీంనగర్: తెలుగు కే న్యూస్

కరీంనగర్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే సామాన్య ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లినా వివిధ రకాల పరీక్షలు, స్కాన్లు, మందులు, గది ఛార్జీలు, వైద్య సేవల పేరుతో భారీగా బిల్లులు వేస్తున్నారనే ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది.మరోవైపు కొంతమంది బ్రోకర్లు, మధ్యవర్తులు వ్యక్తులను ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లి కమీషన్లు పొందుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారిని కూడా ఆసుపత్రిలో చేర్చి, వారి ద్వారా కమీషన్లు పొందుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై అధికారులు విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.రోగికి చికిత్స అవసరమా? ఏ పరీక్ష ఎందుకు? ఎంత ఖర్చు? అనే వివరాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. రోగికి ఖర్చుల విషయంలో స్పష్టంగా ఉండాలని, ఆసుపత్రుల్లో ఛార్జీల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.తెలంగాణలో స్టాబ్లిష్‌మెంట్స్‌ నమోదు, నియంత్రణకు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. విద్యార్థుల హక్కులకు సంబంధించిన చార్టర్‌ కూడా కేంద్ర స్థాయిలో అమలులో ఉంది.ప్రభుత్వం ప్రత్యేక ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, అనవసర పరీక్షలు, అధిక పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సామాన్యుడి జేబుకు భారం కాకుండా ప్రభుత్వం కఠిన పర్యవేక్షణ చేయాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :