

ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సుమారు రూ.40 వేల నగదుతోపాటు నిత్యావసర సరుకులు, దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధిత కుటుంబం తెలిపింది. ప్రమాదంలో ఓ మహిళకు గాయాలైనట్లు సమాచారం.
మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.




