

ఈ సందర్భంగా హాట్ కుక్ మీల్, సమతుల్య ఆహారం, శిశు సంరక్షణ అంశాలపై వివరించారు. పోషకాహార లోపం నివారణకు ప్రతి కుటుంబం పోషకాహార నియమాలను పాటించాలని సూచించారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ చేయించి, చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ బాబుసింగ్, ఉప సర్పంచ్ సందీప్, కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


